UPDATES  

 దట్ ఇస్..ఎమ్మెల్యే రేగా మార్క్ శవాల కావళ్ళకు ఇక స్వస్తి

  • దట్ ఇస్..ఎమ్మెల్యే రేగా మార్క్
  • శవాల కావళ్ళకు ఇక స్వస్తి
  • జోలేకట్టి వాగు దాటే ఘటనలు కనుమరుగు
  • నరకప్రాయం నుంచి నడకప్రాయం
  • గర్భిణీలు వాగు దాటే పరిస్థితులకు చెక్
  • వారధి కోసం ప్రభుత్వం భారీగా నిధులు
  • అభివృద్ధి పదంలో ఉమ్మడి గుండాల మండలం

మన్యం న్యూస్ గుండాల.. గుండాల, ఆళ్లపల్లి మండలాలలో శవాల కావళ్లు కనుమరుగయ్యాయి. గతంలో మండలంలో ఎవరైనా మృతిచెందితే వర్షాకాలం వచ్చిందంటే ఆ శవాలను దాటించేందుకు వారి బంధువులు కావడి కట్టి జోలెపట్టీ శవాన్ని అతి కష్టం మీద వాగు దాటించేవారు. గర్భిణీలు పురిటి నొప్పుల తో ఉప్పొంగే వాగుతో పోరాడుతూ వాగు దాటాల్సిన పరిస్థితి నెలకొనేది. విద్యార్థులు ఉపాధ్యాయులు విధులకు వెళ్లాలన్న వాగులతో పోరాడుతూ వాగు దాటాల్సి ఉండేది. రైతులు నిత్యం వాగుతో సావాసం చేస్తూ దాటాల్సిన పరిస్థితి గతంలో నెలకొనేది. ఇప్పుడు దీనికి భిన్నంగా పరిస్థితులు మారిపోయాయి. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఉమ్మడి మండలం రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. ఉమ్మడి గుండాల మండలానికి పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసి కిన్నెరసాని, ఏడి మెలికల వాగు, మల్లన్న వాగు, దున్నపోతుల వాగు, జల్లేరు వాగుల పై వంతెనలను పెద్ద ఎత్తున పూర్తి చేయించారు. వీటితోపాటు చిన్నచిన్న వాగులు పై కూడా కల్వర్టులను పకడ్బందీగా కట్టడంతో వర్షాకాలంలో ఎటువంటి అవాంతరం లేకుండా ప్రజలు ప్రయాణించే విధంగా రహదారులను తీర్చిదిద్దారు. గతంలో వాగులు దాటలేక సరైన వైద్యం అందక ఎందరో ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఉండేది. అనారోగ్యం లేదా ప్రమాదం బారిన పడి ఎవరైనా మరణిస్తే వారి బంధువులు వారిని చూసేందుకు కూడా వెళ్లలేని పరిస్థితి గతంలో ఉండేది. వెళ్లాలంటే వాగు దాటాలి వాగు దాటుదామంటే ప్రవాహం ఉదృతంగా ఉండడంతో తామేమైనా ప్రమాదాల బారిన పడతమేమో అని వారు బంధువులను చూసేందుకు కూడా వెళ్లేందుకు సాహసించేవారు కాదు. ఇప్పటికే పెద్ద ఎత్తున అన్ని గ్రామాలకు వంతెనలు పూర్తయ్యాయి మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి ఏదేమైనా ఉమ్మడి మండలాల ప్రజల కష్టాలు తీరినట్లేనని మండల ప్రజలు తమ మనోభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి అభివృద్ధికి ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కారణమని పేర్కొంటున్నారు. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల దశ దిశ మార్చినఎమ్మెల్యే రేగా ఆళ్లపల్లి గుండాల మండల ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారని మండల ప్రజలు పేర్కొంటున్నారు .

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !