పేదలకు సేవ చేయడం సంతృప్తిని ఇస్తుంది*
మన్యం న్యూస్ గుండాల..పేదలకు సేవ చేయడం సంతృప్తినిస్తుందని నవ చైతన్య యూత్ అధ్యక్షులు పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. మండలంలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారిని పువ్వాడ ఫౌండేషన్, నాగచైతన్య యూత్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించామనీ పేర్కొన్నారు ఆపరేషన్ అవసరమైన వారిని గుర్తించిన 45 మందిని ఆపరేషన్ పూర్తి చేయించి ఇంటికి పంపించామని అన్నారు. ఆపరేషన్ చేయించుకున్న వారందిని ఆదివారం పరామర్శించి వారి యోగక్షేమాలని అడిగి తెలుసుకున్నామన్నారు. రానున్న రోజులలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వినయ్, సునీల్, రాజేష్ , శరత్, శివ తదితరులు పాల్గొన్నారు.