UPDATES  

 క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం • ఎంపీపీ బానోత్ పార్వతి

 

మన్యం న్యూస్ చండ్రుగొండ, మే 15: క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని
ఎంపీపీ బానోత్ పార్వతి అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయఆవరణలో జరిగిన సిఎం కప్ క్రీడల పోటీలను ఆమెలాంచనంగాప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ…. యువత క్రీడల ద్వారా ఉపాధిని సైతం పొందవచ్చన్నారు. మంచి క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందన్నారు. క్రీడల్లో గెలుపోటములు సమానమని, ఓటమిని పునాదిగా చేసుకొని గెలుపుకు బాటలు వేసుకోవాలన్నారు. క్రీడాకారులు క్రీడల్లో తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటీసీ లంకా విజయలక్ష్మి, సర్పంచ్ గుగులోత్ బాలాజీ, ఎంపిడీఓ రేవతి, తహసీల్దార్ వర్సా రవికుమార్, ఎంఈఓ సత్యనారాయణ, మండల పంచాయతీ అధికారి తోట తులసీరాం, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !