మన్యం న్యూస్ గుండాల ….మండల కేంద్రంలో గిరిజన సహకార సంస్థ ద్వారా నిర్వహించబడుతున్న బంకులు కొన్ని రోజులుగా పెట్రోల్ డీజిల్ పెద్ద ఎత్తున కొరత ఏర్పడిందని దానికి కారణం నిర్వహణ లోపమేనని గుండాల ఎంపీపీ ముక్తిసత్యం ప్రజా ప్రతినిధులతో కలిసి ఐటీడీఏ పీవో కు సోమవారం వినతి పత్రం అందించారు. మండల కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో పట్టణ ప్రాంతాలు ఉన్నందున అక్కడికి వెళ్లాలంటే పెట్రోల్ డీజిల్ లేక వాహనాలు కదలలేని పరిస్థితి నెలకొందని అన్నారు. 20 రోజుల నుంచి పూర్తిగా బంకులో ఇంధనం లేకపోవడంతో రైతులతో పాటు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే స్పందించి జిసిసి అధికారులకు నిరంతరం ఇంధనం ఉండేలా ఆదేశించాలని ఆయన పిఓ కు వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రామక్క,గుండాల సర్పంచ్ సీతారాములు, ఎంపీటీసీలు రాజేశ్వరి, పద్మ లు పాల్గొన్నారు
