మన్యం న్యూస్ చండ్రుగొండ, మే 15 : మండల పరిధిలోని తుంగారం గ్రామ పంచాయతీ, టేకులబంజర గ్రామంలో నాటుసారా విక్రయించే వ్యాక్తులు ఆరుగురిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ శాఖ ఎస్సై సాయికుమార్ తెలిపారు. సోమవారం తహసిల్దార్ వర్సా రవికుమార్ ఎదుట రెవెన్యూ కార్యాలయంలో ఆరుగురు వ్యక్తులను బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ… గ్రామాల్లో నాటుసారా విక్రయించిన, సహకరించిన వ్యక్తులపై చట్టపరంగా
చర్యలుంటాయన్నారు. ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకంగా నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది, పాల్గొన్నారు.