మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఏప్రిల్ 16::
మండలంలోని పెద్ద కమలాపురం గ్రామంలో అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన నాగరాజు వీరయ్య కుటుంబాలను మంగళవారం టిఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించారు అనంతరం వారికి మండల అధ్యక్షులు సత్యాలు ఆధ్వర్యంలో బియ్యం వంట గిన్నెలు నిత్యవసర సరుకులు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిప్రమాదంలో గూడు కోల్పోయిన కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ప్రభుత్వం ద్వారా వారికి ఇల్లు మంజూరు చేపిస్తామని ధైర్యంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేసు లక్ష్మి పార్టీ ప్రధాన కార్యదర్శి రాముడు అధికార ప్రతినిధి ఎండి జానీ పాషా ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీకాంత్ యూత్ కార్యదర్శి గంగరాజు నాయకులు సుబ్బారావు సురేష్ మల్లేశ్వరరావు కృష్ణ బాబు తదితరులు పాల్గొన్నారు.