మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 16: అదుపుతప్పి ఓ ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మంగళవారం అశ్వారావుపేట మండలం మద్దికొండ గ్రామంలో సమీపంలో దమ్మపేట మండలం, మందలపల్లి గ్రామానికి చెందిన ఒక రైతు ట్రాక్టర్ ద్వారా అచ్యుతాపురంలో ఫామాయీల్ మట్టలను రాచూరుపల్లి తరలిస్తున్న క్రమంలో మార్గం మధ్యలో మద్దికొండ గ్రామంలో ద్విచక్రం వాహనం అడ్డు రావడంతో ప్రమాదం జరగకుండా తప్పించే క్రమంలో ట్రాక్టర్ నీ రోడ్డుపై నుండి క్రిందకు దింపి మరల రోడ్డు ఎక్కించే క్రమంలో ట్రాక్టర్ ఇంజన్-ట్రాలీకి అనుసంధానంగా ట్రాక్టర్ నుంచి వేరు కావడంతో ఒక్కసారి అదుపుతప్పి ట్రాక్టరు ట్రక్ రోడ్డు ప్రక్కకు పడింది. ట్రాక్టర్ డ్రైవర్ సమయస్ఫూర్తితో ట్రాక్టరను ప్రక్కకు తిప్పి ఆపడంతో ప్రమాద తప్పింది. రహదారి కి ఇరువైపులా ఎడ్జ్ లకు సమానంగా మట్టి వేయకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా తగుచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.