మన్యం న్యూస్,ఇల్లందు: టేకులపల్లి మండలం తహశీల్దార్ కార్యాలయం నందు 56మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఇల్లందు శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ మంగళవారం అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…పేదప్రజలకు అండగా నిలిచిన నాయకుడు కెసిఆర్ అని, ఆడపడుచుల కోసం కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లాంటి అద్భుత పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు పేదింటి ఆడపడుచుల కోసం ఇటువంటి బృహత్తర పథకాలను ప్రవేశపెట్టలేదని అన్నారు. పేదల ప్రభుత్వం బీఆర్ఎస్ అని, పేదల సంక్షేమం కోసం అనేక పథకాలకు శ్రీకారం చుట్టిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే పేద పేదింటి ఆడపడుచుల కోసం పెద్దఅన్న వలె 100116/- రూపాయలు అందజేయడం జరుగుతుంది అని అన్నారు. పేదింటి ఆడబిడ్డలకు బిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యాఖ్యానించారు. కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంటే కొంతమంది విద్రోహక శక్తులకు అది నచ్చడం లేదని, వారికి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి రుచించడం లేదని ఎద్దేవా చేశారు.
కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని, రానున్న ఎన్నికల్లో మళ్ళీ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని అందులో ఎలాంటి సందేహం అవసరం లేదని అన్నారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్య రాధా, ఎమ్మార్వో వీరభద్రం, ఎంపీడీవో వీరబాబు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్, సర్పంచులు, మాలోత్ రాజేందర్ నాయక్, మాలోత్ సురేందర్ నాయక్, బానోత్ విజయ, ఎంపీటీసీ, చింత శాంత కుమారి, నాయకులు కంభంపాటి చంద్రశేఖర్, బానోత్ రామ నాయక్, బానోత్ కిషన్ నాయక్, చీమల సత్యనారాయణ, భూక్య రవి నాయక్, బర్మావత్ శివకృష్ణ, ఇస్లావత్ బాలు, భూక్య సైదులు, భూక్య రాజా నాయక్, మాలోత్ పూల్ సింగ్, బానోత్ నాగేందర్ నాయక్, తేజావత్ రవి,గుగులోతు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.