మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి మే 16:అన్నపురెడ్డిపల్లి మండల హెడ్ క్వార్టర్స్ లోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం అశ్వరావుపేట నియోజకవర్గం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభ్యర్థి జారే ఆదినారాయణ ఈ నెల 29 న ఖమ్మం ఎస్.ఆర్ గార్డెన్స్ లో నిర్వహించే మెగా జాబ్ మేళా క్యాలెండర్ ను ఆవిష్కరించారు.అనంతరం జారే ఆదినారాయణ మాట్లాడుతు ఉమ్మడి జిల్లా స్థాయిలో నిర్వహించే ఈ మెగా జాబ్ మేళా యువతకు ఒక గొప్ప అవకాశమని ఆయన అన్నారు.ఈ జాబ్ మేళాను రెండు జిల్లాలలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,ఈ జాబ్ మేళా కి ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేశారని తెలిపారు.ఈ వెబ్ సైట్ ద్వారా ప్రతీ నిరుద్యోగి తమ పేర్ల ను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో అన్నపురెడ్డిపల్లి వైస్ సర్పంచ్ పరసా వెంకట్,సర్పంచ్ బోడా పద్మా, శ్రీనివాసరెడ్డి అభిమాన నాయకులు వీరబోయిన నాగేశ్వరరావు,పరకాల లక్ష్మారెడ్డి,రాజా,వేణు,లాలు,కొండ్రు రత్నం బాబు,శీనన్న అభిమానులు తదితరులు పాల్గొన్నారు