మన్యం న్యూస్ కరకగూడెం: మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన బిఅర్ఎస్ పార్టీ కార్యకర్త వడ్లకొండ.రామతర ఇటీవల కాలంలో అనారోగ్యంతో బాధపడుతూ ప్రవేటు వైద్యశాలలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తిసుకుంటున్న విషయం స్థానిక సర్పంచ్ ఇర్ప విజయ్ కుమార్, బిఅర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మల్కం.వెంకటేశ్వర్లు విషయం తెలపడంతో వారి నివాసానికి వెళ్లి పరామర్శించి,యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు ఎవిదమైన ఆపాద వచ్చిందని తెలిస్తే ప్రతి ఒక్కరికి అండగ ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళికా మండల అధ్యక్షులు రావుల.సోమయ్య పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
