UPDATES  

 సింగరేణి పునరావాస కొత్త కొండాపురం గ్రామ త్రాగునీటి సమస్య పరిష్కరించండి.

సింగరేణి పునరావాస కొత్త కొండాపురం గ్రామ త్రాగునీటి సమస్య పరిష్కరించండి.

-ఏరియా జిఎం దుర్గం రామచందర్,అధికారులకు వినతిపత్రాలు అందజేసిన గ్రామస్తులు.

మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 16

మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి పునరావాస కొత్త కొండాపురం గ్రామ త్రాగునీటి సమస్య ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ,ఐఎఫ్ టియు ఆధ్వర్యంలో గ్రామస్తులు మంగళవారం ఏరియా జిఎం దుర్గం రాంచందర్,ఎస్ ఓ టు జిఎం డి.లలిత్ కుమార్ టీబీజీకేఎస్ నాయకులు వి. ప్రభాకర్ రావు కు వినతి పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా ఐఎఫ్ టియు నాయకులు నాసర్ పాషా మాట్లాడుతూ,సింగరేణి పునరావాస కొత్త కొండాపురం గ్రామంలో 70 కుటుంబాల వరకు గిరిజనులు నివసిస్తున్నారని,వీరంతా ఓసీ-2 విస్తరణ కోసం కొండాపురం గ్రామాన్ని ఖాళీ చేసిన వారు అని తెలిపారు. శివలింగపురం శివాలయం సమీపంలో సింగరేణి కేటాయించిన స్థలంలో గృహాలు నిర్మించుకున్నారని, సింగరేణి ఆధ్వర్యంలో 20 ఏళ్ల క్రితం గ్రామంలో కల్పించిన త్రాగునీటి సౌకర్యం పైప్ లైన్ నీటి సరఫరాలో ఇబ్బంది వస్తున్నాయి అని,నీరు సరిగా సరఫరా కాక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితనీ అధికారులకు వివరించారు. వేసవి కావడంతో ఈ కష్టాలు మరి ఎక్కువయ్యాయన్నారు. సింగరేణి సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా సిఎస్ఆర్ నిధుల ద్వారా సింగరేణి పునరావాస గ్రామమైన కొత్త కొండాపురం గ్రామానికి తాగునీరు సక్రమంగా సరఫరా చేసే విధంగా తగు చర్యలు చేపట్టాలని,దీనికై కొత్త పైపులు వేయాలని అన్నారు. స్మశాన వాటికకు స్థలం లేకపోవటంతో ఇబ్బంది అవుతోందనీ,హిందూ స్మశాన వాటికకు స్థలం కేటాయించాలనీ,మురుగునీటి కాలువలకు నిధులు మంజూరు చేయాలని అన్నారు.మిగిలి ఉన్న అంతర్గత సిసి రోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్థులు కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు,కాటిబోయిన.నరసింహారావు,శ్రీనివాస్,పాపారావు,రవి,ఇందు ,వెంకటరమణ,నాగ స్వరూప, గౌరీ,సరోజినీ,అమ్ములమ్మ,నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !