మన్యం న్యూస్ వాజేడు. మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుకర్ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధికి కారణమైన దోమల నుండి రక్షించుకునేందుకు దోమ తెరలు, గ్రామ గ్రామాన డ్రైడే ఫ్రైడే నిర్వహించాలని, డ్రైనేజీ కాలువలు, ఇంటి పరిసర ప్రాంతాలలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు కుట్టకుండ చర్యలు తీసుకోవాలని, సూచించారు. డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాజేడు మండల కేంద్రంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయ, ఎం పి ఓ శ్రీకాంత్ నాయుడు, వైద్య సిబ్బంది కోటిరెడ్డి, శేఖర్ ,ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
