మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 16: మండల పరిదిలోని పేరాయిగూడెం గ్రామ పంచాయితీలో ఉపాధి హామీ కార్మికులకు తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్బంగా అశ్వారావుపేట నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కట్రం స్వామి దొర ఉపాధి హామీ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలుగు దేశం పార్టీ ప్రజలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడంలో ముందు ఉంటుందని పూర్వ వైభవం రావాలంటే తెలుగుదేశం పార్టీనీ సేవలను గుర్తుంచుకోవాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు నార్లపాటి శ్రీనివాసరావు, అంకోల్ వెంకటేశ్వరావు, బొడ్డపాటి ఉదయ్, నార్లపాటి బన్ను పాల్గొన్నారు.