మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ప్రతినిధి
నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ కొరియర్ను అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు.మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో దుమ్ముగూడెం మండలంపైడిగూడెం అటవీ ప్రాంతంలో దుమ్ముగూడెం పోలీసులు,141 బి ఎన్ సి ఆర్ పి ఎఫ్ పోలీసు సిబ్బంది స్పెషల్ పార్టీ పోలీసులు కలిసి సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీలలొ ఒక
అనుమానితున్ని పట్టుకుని విచారించగా అతను నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ
బెటాలియన్ కొరియర్ గా నిర్ధారణ అయినదన్నారు.
అరెస్టు కాబడిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ కొరియర్ కపిల్ రాయ్ తండ్రి కనక రాయ్, వయసు:20 సంవత్సరాలు, వృత్తి సంత వ్యాపారని సిపిఐమావోయిస్టు పార్టీ కొరియర్, , గ్రామం, పొడియా తాలూకా, మల్కన్ గిరి జిల్లా,ఒరిస్సా రాష్ట్రం.కు చెందినవాడని అన్నారునిందితుడు కపిల్ రాయ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం మారుమూల గ్రామాలలో జరిగే
వారాంతపు సంతలలో వ్యాపారం చేస్తుంటాడని. ఈ సందర్భంలో నిషేధిత సిపిఐ మావోయిస్టు
పార్టీ బెటాలియన్ వారితో పరిచయం ఏర్పడి, వారికి కావలసిన సామాన్లు, ఎలెక్ట్రానిక్
పరికరాలు ప్రేలుడు పదార్ధాలను సరఫరా చేస్తూ వారితో సంభందాలు కొనసాగిస్తున్నాడన్నారు. అందులో భాగంగానే మావోయిస్టు పార్టీకి కావల్సిన సామాన్లు ఇతర వస్తువులు వారికి అందజేసే క్రమంలో వాహన తనిఖీలలొ పోలీసులకు
పట్టుబడ్డాడన్నారు సంత వ్యాపారులు ఎవరూ కూడా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి ప్రత్యక్షంగా
గానీ, పరోక్షంగా గానీ సహకరించ వద్దని, ఒకవేళ ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు
పాల్పడితే,వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మావోయిస్టు పార్టీ
అగ్ర నాయకులు తమ స్వార్ధ ప్రయొజనాల కోసం అమాయకులైన ప్రజలకు మాయమాటలు
చెప్పి,వారి చేత చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు.
ఇప్పటికే అనేకమంది నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ నాయకులు, సభ్యులు తమపార్టీ ప్రజలలో ఆదరణ కోల్పోయిందని గ్రహించి ఈ సిద్ధంతాలు విజయం సాధించలేవని తెలుసుకొని,ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని అనేకమంది పోలీసు వారి
సమక్షంలో లొంగిపోవడం జరుగుచున్నదన్నారు. మావోయిస్టు పార్టీ నుండి బయటికి వచ్చి
జనజీవన స్రవంతిలో కలవాలనుకునేవారు స్వచ్చందంగా గానీ, బంధుమిత్రుల ద్వారా గాని
తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో గాని లేదా జిల్లా పోలీసు ఉన్నతాధికారులను గానీ
సంప్రదించగలరని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేశారు. పట్టుబడిన నిందితుడి వద్ద నుంచి రంపం మిషన్ ఒకటి, డ్రిల్ మిషన్ ఒకటి ,రూ 45000నగదు, జిలేటెన్ స్టిక్స్10, డిటోనేటర్లు 10, ఎయిర్ గన్ ఒకటి, స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు