మన్యం న్యూస్ గుండాల: సీఎం కప్ మండల స్థాయి క్రీడలను ఆళ్లపల్లి ఎంపీపీ మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ క్రీడ పోటీలలో విద్యార్థులు యువకులు పాల్గొనాలని సూచించారు. ఈ పోటీలతో క్రీడాకారుల నైపుణ్యతను వెలికి తీయవచ్చని ఆమె అన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వంతో పాటు ఉద్యోగ అవకాశాలను కూడా పొందవచ్చుని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామారావు, సర్పంచ్ గోపాల్,అధికారులు క్రీడాకారులు పాల్గొన్నారు
