UPDATES  

 మండుటెండలో ఎమ్మెల్యే మెచ్చా పర్యటన

  • మండుటెండలో ఎమ్మెల్యే మెచ్చా పర్యటన
  • అభివృద్ది మరియు ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతాను ఎమ్మెల్యే మెచ్చా
  • కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది
  • రూ.1.65 కోట్లతో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే మెచ్చా
    ఆసుపాక గ్రామంలో 30కుటుంబాలు చేరిక
    మిగిలిన మట్టి రోడ్లు అన్ని సీసీ రోడ్లు చేస్తా ఎమ్మెల్యే మెచ్చా

మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 16: అశ్వారావుపేట మండలంలో మంగళవారం ఎమ్మెల్యే మెచ్చా ఎండలు మండి పోతున్నా లెక్కచెయ్యకుండా విస్తృతంగా పర్యటించారు, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండల పరిదిలోని దిబ్బగూడెం, అచ్యుతాపురం ఎస్సి కాలని, అచ్యుతాపురం, మద్దికొండ, పెన్నాడ వారిపాలెం, జమ్మిగూడెం, కేశప్పగూడెం, రాజీవ్ నగర్, కమయినగర్, దబ్బతోగు, వినాయకపురం కాలనీ, వినాయకపురం, ఆసుపాక కాలని, ఉసర్లగూడెం, తిరుమలకుంట, పాతరెడ్డిగూడెం, సుధగోతులగూడెం గ్రామాల్లో కోటి 65లక్ష్యల వ్యయంతో పోసిన 18 సీసీ రోడ్లను ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్థానిక ప్రజా ప్రతినిధులతో గ్రామ ప్రజలతో కలిసి ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ఆ గ్రామాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఆసుపాకగ్రామంలో మెచ్చా సమక్షంలో 30కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారిని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే మెచ్చా ఆహ్వానించారు. గ్రామానికి సీసీ రోడ్డు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాజీవ్ నగరం గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లకు మీటర్లు ఇవ్వలేదని ఇబ్బందీ పడుతున్నామని వారు తెలుపడం తో వెంటనే ఎడి కి ఫోన్ చేసి వెంటనే మీటర్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా అక్కడ త్వరలో సీసీ రోడ్డు కూడా మంజూరు చేస్తాననీ తెలిపారు. సుధగోతులగూడెం గ్రామానికి బిటి రోడ్డు మరియు సీసీ రోడ్డు మంజూరు చేయడంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అలాగే మంచి నీరు అందట్లేదని మెచ్చాకి తెలుపడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మెచ్చా అక్కడే ఉన్న ఆర్డబల్యు అధికారిని 2రోజుల్లో సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సున్నంశట్టి వరలక్ష్మి, ఎంపీపీ జల్లిపల్లి, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ లు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డ్ మెంబర్ లు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !