మన్యం న్యూస్,ఇల్లందు:అతిత్వరలో ప్రారంభంకానున్న 12వ వార్డులోని బస్తీ దవాఖానను జిల్లా వైద్యాధికారులతో కలిసి అక్కడ జరుగుతున్న పనులను 12వ వార్డు కౌన్సిలర్ సిలివెరి అనిత, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సిలివెరు సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పేదలకు నాణ్యమైన వైద్య సేవలందించేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం బస్తీ దవాఖానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని 12వ వార్డు లోని బస్తీ దవఖాన పనులు తుది దశకు చేరాయని, అతిత్వరలో బస్తీ దవాఖానాను స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. బస్తీ దవాఖానలను అతిత్వరలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా శరవేగంగా పనులు జరిగాయని, ప్రస్తుతం ముగింపుదశకు చేరుకున్నాయని పేర్కొన్నారు.
ఈ బస్తీ దవాఖానాలో వైద్యుడు, స్టాఫ్ నర్స్ మరియు సిబ్బంది ప్రజలకు వైద్యసేవలు అందించనున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు, స్టాప్ నర్సులు , బస్తీపెద్దలు పాల్గొన్నారు.