నడకన వెళ్ళి అభివృద్ధి పనులకు నాంది వేసిన ప్రభుత్వ విప్ రేగా.
మన్యం న్యూస్ కరకగూడెం: మండు ఎండను లెక్క చెయ్యకుండ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోఅభివృద్ధి పనులకు నాంది వేశారు. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఉదయం 7 గంటల నుంచి కొన్ని గ్రామాలలో కాలినడక వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేస్తూ గ్రామాలను కలయ తిరిగారు. ఉదయం నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్న రేగా మాత్రం భానుడి ప్రతాపాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నమై పాల్గొన్నారు. ఎండైనా వానైనా పనిచేయాలనుకుంటే ముందుకెళ్లడం ఒక ఎమ్మెల్యే రేగా కాంతారావు కే సాధ్యమని మండల ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు,తహశీల్దారు ఉషా,శారద,డిప్యూటీ తహశీల్దారు సంద్య, ఎంపీపీ రేగా కాళికా, మండల అధ్యక్షులు రావుల.సోమయ్య, వివిధ గ్రామపంచాయతిల సర్పంచ్ లు ప్రజలు బిఅర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు