మన్యం న్యూస్. ములకపల్లి. మే 16.మండలంలో ని మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో డెంగ్యూ నివారణ, దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతకు సంబంధించిన నినాదాలు చేస్తూ సరస్వతి శిశు మందిర్ విద్యాలయం నుండి ప్రధాన కోడలి మీదిగా సాయిబాబా గుడి వరకు సాగి మరలా ప్రధాన కూడలికి చేరుకొని అక్కడ మానవహారం నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ సాయి కళ్యాణ్ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధిని నివారించాలంటే దోమలు పెరగకుండా చూడాలని,ఇంటి పరిసరాలలొ,పబ్లిక్ ప్రదేశాలలో నీరు నిల్వ లేకుండ చేస్తే,దోమలు గుడ్లు పెట్టే ప్రదేశాలు లేకుండా పోతాయని, తద్వారా దోమల పెరుగుదలను నివారించవచ్చని, డెంగ్యూ, మలేరియా, మెదడువాపు, బోదకాలు వంటి కీటక జనిత వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏ ఎన్ ఎమ్ లు, హెల్త్ వెల్నెస్ సెంటర్లకు సంబంధించిన ఎమ్ ఎల్ హెచ్ పి లు, హెల్త్ అసిస్టెంట్ లు, ఆశాకార్యకర్తలు,సూపర్వైజర్లు పాల్గొన్నారు .
