మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సయ్యద్ జానీపాషా బావమరిది అయిన ఎండి జబ్బార్ గుండెపోటుతో సోమవారం మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ జబ్బర్ భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబానికి మనోధైర్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, ఇల్లందు పట్టణ నాయకులు గిన్నారపు రవి, ఇల్లందు మండల వైస్ ఎంపీపీ ప్రమోద్, మండల కోఆప్షన్ సభ్యులు ఘాజి, ఈదుల ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.