UPDATES  

 నకిలీ విత్తనాలపై రైతులను అప్రమత్తం చేయండి

  • నకిలీ విత్తనాలపై రైతులను అప్రమత్తం చేయండి
  • లైసెన్సులు గల వ్యాపారస్తుల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి
  • నకిలీ విత్తు నియంత్రణకై అధికారులు నిఘా పెంచండి
    జిల్లా కలెక్టర్ అనుదీప్

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

రైతులు లైసెన్సు కలిగిన వ్యాపారుల నుంచి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని నకిలీ విత్తనాలు పట్ల రైతులను అప్రమత్తం చేయాలని నకిలీ విత్తనాలను నియంత్రణ కోసం అధికారులు పూర్తిస్థాయిలో నిఘా పెంచాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను సూచించారు. మంగళవారం విత్తనాలు, ఎరువులు సరఫరా, నకిలి విత్తనాలు అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ, ఉద్యాన, సహాకారశాఖ అధికారులతో హైదరాబాదు నుంచి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్సు అనంతరం జిల్లా కలెక్టర్ అనుదీప్
మాట్లాడుతూ గ్రామాలలో మద్యవర్తులు, దళారులు రైతులకు నకిలి విత్తనాలు అంటగట్టే ప్రయత్నం చేస్తుంటారని వారి నుండి కొనుగోలు చేసి మోసపోవద్దని చెప్పారు. ముఖ్యంగా గుంటూరు, బాపట్ల తదితర ప్రాంతాల నుంచి దళారులు
గ్రామాలలో పర్యటిస్తూ తెలిసిన రైతులను లక్ష్యంగా ఎంచుకుని కమిషన్ ఇస్తూ ఆ గ్రామ రైతులతోనే నకిలీ విత్తనాలు విక్రయాలు చేస్తుంటారని అటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. లైసెన్సులున్న ఆధీకృత డీలర్లు నుంచి మాత్రమే విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారకాలు కొనుగోలు చేయాలని ఆయన చెప్పారు. అదేవిధంగా
కొనుగోలు చేసిన వెంటనే డీలర్లు సంతకంతో బిల్లులు తీసుకోవాలని, తీసుకున్న బిల్లులను పంటకాలం పూర్తయ్యే వరకుబద్రపరచుకోవాలని సూచించారు కొనుగోలు చేసిన విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక బిల్లులు బద్రపరచుకోవడం వల్ల
పంట నష్టపోవడం కానీ, నకిలి విత్తనాలని తేలడం కాని, దిగుబడి తగ్గడం, పూత, కాతలు రాకపోయిన సంబంధిత కంపెనీ బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. అదేవిధంగా రైతులు నిషేదిత కలుపుమందైనటువంటి గైపోసెట్
వాడకం చేయరాదని, గైపో సెట్ వినియోగం వల్ల భూమి నిస్సారం అవుతుందని, తద్వారా పంట దిగుబడి తగ్గిపోవడంతోపాటు మానవాళికి వివిధ రకాల వ్యాధులు సంక్రమిస్తాయని అన్నారు. కాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధుల బారిని
పడే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. హెచ్ఐ కాటన్ (హెర్బిసైడ్ టాలరెంట్) మన దేశంలో విక్రయాలకుఅనుమతి లేదని, అలాంటి నిషేదిక విత్తనాలను రైతులు సాగు చేయొద్దని చెప్పారు. హెచీ కాటన్ విత్తనాలు విక్రయించేవ్యాపారులపై పిడి యాక్టు క్రింద కేసులు నమోదు చేయనున్నట్లు ఆయన హెచ్చరించారు. గ్రామాలలో రైతులను
లక్ష్యంగా చేసుకుని నకిలీ విత్తనాలు వ్యాపారాలు నిర్వహించే వ్యక్తులపై బైండోవర్ కేసులు నమోదు చేయనున్నట్లుచెప్పారు. లైసెన్సు లేకుండా గ్రామాలలో రైతులను మభ్యపెట్టి నకిలి విత్తనాలు విక్రయించే వ్యాపారులు, డీలర్లు లేదారైతుల వివరాలను వ్యవసాయశాఖఅధికారులకుతెలియచేయాలని అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కంట్రోల్
రూము నెం. 7288894276 ఏడికి నేరుగా ఫోన్ చేసి వివరాలను తెలిచేయాలని చెప్పారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని, ఎలాంటి బయాందోళనలు లేకుండా నిర్భయంగా వ్యవసాయ అధికారులకు
తెలియచేయాలని చెప్పారు. జిల్లాలో 605 విత్తనాలు విక్రయ డీలర్లున్నారని, డీలర్లు వ్యాపారానికి సంబంధించిన నేమ్,స్టాకు, ధరల పట్టిక, లైసెన్సు వివరాలు క్రమం తప్పక నోటీసు బోర్డులో ఏర్పాటు చేయాలని చెప్పారు. అదేవిధంగా
లైసెన్సుకు సంబంధించిన స్టాకు రిజిష్టరు, డోర్ నెం., సోర్సు సర్టిఫికేట్, ఇన్వాయిస్, డిసి నెంబరు, ఎరువులకు సంబంధించిన ఓ ఫారం, పురుగుమందులకు సంబంధించిన ప్రిన్సిపల్ సర్టిఫికెట్లు ఎప్పటికపుడు లైసెన్సులలో జతచేయాలని అన్నారు వ్యవసాయ అధికారులు క్రమం తప్పక విత్తనానలు, ఎరువుల దుకాణాలను తనిఖీ చేయాలని, ప్రతి వారం తనిఖీ
నివేదికలు అందచేయాలని ఆదేశించారు. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు పంటల వారిగా వారి వారిమండలాల్లో కొరత రాకుండా రైతులకు అందుబాటులో ఉంచాలని అన్నారు. పచ్చిరొట్ట ఎరువులకు సంబంధించి 50శాతం రాయితిపైనా రైతులకు అందించేందుకు ఆన్లైన్ ద్వారా మాత్రమే కూపన్లు జారీ చేయాలని అన్నారు.. ప్రాధమిక
సహాకార వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా విత్తనాలు తీసుకోవాలని ఆయన రైతులకు సూచించారు.ఈ సమావేశంలో ఎస్పి డాక్టర్ వినీత్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఉద్యాన అధికారి జినుగు మరియన్న,డిసిఓ వెంకటేశ్వర్లు, వ్యవసాయశాఖ ఏడిలు లాల్చంద్, రవికుమార్, అప్లైల్బేగం, సుధాకర్, కరుణశ్రీ, వాసవిరాణి,
మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !