UPDATES  

 భక్తిశ్రద్ధలతో బొడ్రాయి ప్రధమ మహోత్సవం

  • భక్తిశ్రద్ధలతో బొడ్రాయి ప్రధమ మహోత్సవం
  • బొడ్రాయి ప్రాంగణంలో మురికి నీరు, ఇబ్బందులు పడుతున్న భక్తులు

మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 16: మండలంలోని తిరుమలకుంట గ్రామంలో బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి గ్రామదేవతల మొదటి మహోత్సవం గ్రామస్థుల సమష్టి కృషితో మంగళవారం అంగ రంగా వైభవంగా జరిగింది. బొడ్రాయి ప్రధమ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామునే మహిళలు బోనాలతో ఊరేగింపుగా బొడ్రాయి వద్దకు చేరుకొని ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మూడు రోజులు పాటు గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. బొడ్రాయి మహోత్సవం సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. అనంతరం మహిళలు, గ్రామస్తులు కుటుంబసమేతంగా భక్తి శ్రద్ధతో తయారు చేసిన బోనాలను పసుపు కుంకుమలతో అలంకరించి, నెత్తిన పెట్టుకొని డప్పు చప్పులతో ఊరేంపుగా తీసుకెళ్లి బొడ్రాయి చుట్టు ప్రదక్షణలు చేసి అక్కడ నుండీ ముత్యాలమ్మ తల్లి దగ్గరికి కాలినడకన వెళ్లి గ్రామదేవతకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తెరాస పార్టీ మండల సెక్రటరీ జుజ్జురి వెంకన్నబాబు దంపతులు, గడ్డం సత్తిబాబు దంపతులు, పల్లెల రామలక్మయ్య దంపతులు, బొడ్దుసత్తిబాబు దంపతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొడ్డు రాయి ప్రాంగణంలో మురికి నీరుతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. పలువురు భక్తులు మాట్లాడుతూ బొడ్రాయి మొదటి వార్షికోత్సవం సందర్బంగా ద‌ర్శ‌నానికి వ‌చ్చిన భ‌క్తులు మురికి కాల్వతో ఇబ్బందులు ప‌డుతున్నాము అని, బొడ్రాయి ప్రాంగణంలో మురికి నీరు పోతున్న పట్టించుకోకపోవడం చాలా బాధాకరంగా ఉందని భక్తులు ఆవేదన తెలుపుతున్నారు. ప్రదక్షణలు చేసేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాము అని వెంటనే మురికి కాల్వను శుభ్రంగా చేసి మురికి నీరు రాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !