మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
నీటి సంరక్షణకు చేసిన కృషికి భద్రాద్రి కొత్తగూడెంజిల్లాకు జాతీయ నీటి అవార్డుల విభాగంలో ముల్కలపల్లి మండలం, జగన్నాథపురం గ్రామ పంచాయతీకి జాతీయస్థాయిలో ప్రధమ స్థానంలో అవార్డు సాధించడం పట్ల జిల్లా కలెక్టర్ అనుదీప్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి నుంచి భద్రాద్రి జిల్లా జాతీయ స్థాయిలో ప్రథమస్థానంలో అవార్డ్ వచ్చినట్లు లేఖ పంపినట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నీటి సంరక్షణకు చేపట్టిన చర్యలు ఫలితంగా జిల్లాకు జాతీయ స్థాయిలో 2022 సంవత్సరానికి మొదటి అవార్డు సాధించించామని, నీటి సంరక్షణ చర్యల్లో బాగస్వాములైన పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందిని జిల్లా కలెక్టర్ అనుదీప్ అభినందించారు.