మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 18
మణుగూరు మల్లేపల్లి ఓసి కె ఎల్ పి మహాలక్ష్మి కంపెనీ నందు పనిచేస్తున్న బ్లాస్టింగ్ కార్మికులకు ఫిట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అని బిఅర్ఎస్ ఓబీ యునియన్ అధ్యక్షులు తురక రామకోటి తెలిపారు.ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ, కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది అన్నారు.అభివృద్దె లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు,బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని వారు కార్మికులను కోరారు.కార్మికుల కు ఎటువంటి కష్టం ఓట్చినా 24 గంటలు అందుబాటులో ఉంటామని బిఆర్ఎస్ ఓబీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమం లో యూనియన్ అధ్యక్షులు తురక రామకోటి,జనరల్ సెక్రటరీ కనతాల మహేష్,ఫిట్ కమిటీ సభ్యులు,కార్మికులు తదితరులు పాల్గొన్నారు.