రూ.1.95 కోట్ల వ్యయంతో 22 సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
నియోజకర్గంలోని ప్రజా సమస్యలు పరిష్కరించడానికే పనిచేస్తున్న: ఎమ్మెల్యే మెచ్చా
మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి మే 18: అన్నపురెడ్డిపల్లి మండలం పరిధిలో గల బూరుగుగూడెం,శాంతినగర్,ఎర్రగుంట,భీమునిగూడెం,రంగాపురం,కట్టుగూడెం,అబ్బుగూడెం,మర్రిగూడెం గ్రామాలలో రూ. 1కోటి 95లక్షలు వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను గురువారం అశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్థానిక ప్రజా ప్రతినిధులు,గ్రామస్థులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని సమస్యలు పరిష్కరించడానికే పనిచేస్తున్నానని,ఇప్పటివరకు నియోజకవర్గంలోని రూ.40కోట్ల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లను ఏర్పాటు చేశామని తెలిపారు.బిఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కెసిఆర్ తోనే ప్రజా సమస్యలు,అభివృద్ధి సంక్షేమాలు సాధ్యమవుతాయని,మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని మళ్ళీ కెసిఆర్ నే ముఖ్యమంత్రిగా గెలిపించాలని అన్నారు.అతి త్వరలోనే అర్హులైన లబ్ధిదారులకు పోడు భూములకు పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు.అనంతరం గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సున్నం లలిత,జడ్పిటిసి భారత లావణ్య,మండల అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు,ఎంపీటీసీలు,సర్పంచుల,వార్డు మెంబర్లు,గ్రామ అధ్యక్షులు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.