మన్యం న్యూస్, పినపాక..
బిఆర్ఎస్ పార్టీ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నదని, దీని కోసమై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గల కార్యకర్తలు నాయకులు సిద్ధం కావాలని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు. తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా దశాబ్ది ఉత్సవాలు జరుగుతాయని, ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాలలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు