మన్యం న్యూస్ ఏటూరు నాగారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఐటిడిఏ పరిధిలోని గిరిజన గుడాలలో, తండాలలో ప్రతి ఇంటికి నీటి సరఫరా జరిగేలా చూడాలని ఏటూరు నాగారం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి అంకిత్ ఆదేశించారు. గురువారం ఐటీడీఏ సమావేశ మందిరంలో పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పివో అంకిత్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాల మేరకు ములుగు జిల్లాలో 9 మండలాలలోని 351 గిరిజన ఆవాస ప్రాంతాలలో 142 మందిని మిషన్ భగీరథ వాటర్ మిలన్ గా తీసుకోవడం జరిగిందన్నారు.వేసవిలో గిరిజన పల్లెల్లో దాహార్తి తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ కృషి చేస్తుందని అన్నారు. ఉదయం,సాయంత్రం సమయపాలన పాటిస్తూ నీరంధించాలన్నారు.ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ సుభాష్,డీఈ లు రవీందర్,సతీష్ 9 మండలాల ఏఈలు తదితరులు పాల్గొన్నారు.