మన్యం న్యూస్, దమ్మపేట, మే, 18: దమ్మపేట మండలం, పెద్దగొల్లగూడెం గ్రామం లో గురువారం కంటి వెలుగు కార్యక్రమం ఏర్పాటు చెయ్యగా ముఖ్య అతిధిగా పాల్గొన్న జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా జడ్పీటీసీ పైడి మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కొరకు ప్రజల పక్షాన నిలబడి వారి జీవితాలలో వెలుగులు నింపాలని తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు, స్థానిక శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ఆదేశానుసారం గురువారం కంటి వెలుగు సెంటర్ ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ నేత్రాలను డాక్టర్ సహాయంతో పరీక్షించుకొని సకాలంలో కళ్లద్దాలను ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు తెలంగాణ ఆయిల్ ఫిడ్ డైరెక్టర్ కొయ్యల అచ్యుత రావు, ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున రావు, జలగం వాసు, యోగానంద్, యార్లగడ్డ బాబు, సర్పంచ్, ఉప సర్పంచ్, మెడికల్ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.