మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు మునిసిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో అంబేద్కర్ భవనానికి బీజం పడింది. స్థానిక శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ చేతుల మీదుగా గురువారం రూ.2.15 కోట్లతో నిర్మించతలపెట్టిన అంబేద్కర్ భవనానికి భూమిపూజ అనంతరం శంకుస్థాపన చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ మాట్లాడుతూ…బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన అంబేద్కర్ అని, ఎందరికో స్ఫూర్తిదాయకుడైన ఆయన భవనాన్ని ఇల్లందు పట్టణంలో నిర్మించతలపెట్టటం సంతోషంగా ఉందన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని, అంబేద్కర్ చూపిన మార్గంలో పయనించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, జిల్లా అధికార ప్రతినిధి పులిగండ్ల మాధవరావు, స్థానిక 22వ వార్డ్ కౌన్సిలర్ అంకెపాక నవీన్, ఇల్లందు మున్సిపల్ కమిషనర్ అంకుషావలి, ఇల్లందు పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, ఇల్లందు పట్టణ మహిళా అధ్యక్షురాలు నెమలి ధనలక్ష్మి, నాలుగవ వార్డ్ కౌన్సిలర్ సయ్యద్ ఆజాం, ఆరవవార్డ్ కౌన్సిలర్ తోటలలితా శారద, 11వవార్డ్ కౌన్సిలర్ శ్రీను, 23వ వార్డ్ కౌన్సిలర్ కుమ్మరి రవీందర్, 24వ వార్డ్ కౌన్సిలర్ వాంకుడోత్ తార, ఇల్లందు వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహర్ తివారి, అధికార ప్రతినిధి పివి కృష్ణారావు, అబ్దుల్ నబీ, ఇల్లందు పట్టణ నాయకులు గిన్నారపు రవి, సంద ప్రవీణ్, పోబులు కిరణ్, ఎర్ర ఈశ్వర్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మేకల శ్యామ్, ఇల్లందు పట్టణ ప్రచార కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారపు రాజేష్, ఇల్లందు పట్టణ యూత్ ప్రెసిడెంట్ మెరుగు కార్తీక్, యువజన నాయకులు పాలడుగు రాజశేఖర్, నెమలి నిఖిల్, లలిత్, మహిళా కమిటీ గండ్రాతి చంద్రావతి, బోప్పి భాగ్యలక్ష్మి, ఇల్లందు మండల కోషన్ సభ్యులు ఘాజి, ఇల్లందు మండలవార్డు నెంబర్ నీలం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.