UPDATES  

 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

 

మన్యం న్యూస్, అశ్వరావుపేట, మే, 18: మండల పరిదిలోని గాండ్లగూడెం గ్రామంలో గురువారం నుంచి నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అశ్వరావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, అదే విదంగా మొదటి టోర్నమెంట్ ను టాస్ వేసి ప్రారంభించిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి మండల నాయకులు మందపాటి మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎంపీపీ జల్లిపల్లి మాట్లాడుతూ ఆటలనేవి యువకులకు మానసిక ఉత్సాహంతో పాటు ప్రశాంతతను ఇస్తాయని ఈ యొక్క టోర్నమెంట్ ను ఇక్కడ ఎర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు ఇప్పటికే చుట్టూ పక్కల గ్రామాల నుండి సుమారు 61 టీంలు పేర్లు ఇచ్చారని ఇన్ని జట్లతో పోరాడి ఆకరి టోర్నమెంట్ విజేతగా నిలిచే వారు ఎవరో వేచి చూడాలని ఆయన తెలిపారు. అలాగే ఈ టోర్నమెంట్ లో గెలిచిన క్రీడా కారులకు అశ్వారావుపేట శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వర రావు రూ.40116- మొదటి బహుమతి అందజేస్తున్నారనీ అలాగే రెండవ బహుమతి రూ. 20116 మూడవ బహుమతి గా రూ.12116 ప్రైజ్ మని మరియు సీల్డ్ ను అందజేస్తున్నారనీ, అదేవిదంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బెస్ట్ ప్లేయర్స్ కు రూ. 5116 ప్రైజ్ మని ఉంటుందని కమిటి వారు తెలియజేసారని, ఎండలు ఎక్కువగా ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకుంటు ఈ టోర్నమెంట్ ను విజయవంతం చేయాలని ఆటలు అడే క్రీడా కారులకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకన్నబాబు, సర్పంచ్ భూక్య చిలకమ్మ, డైరెక్టర్ భూక్య ప్రసాద్, మాలోతు ఆలీబాబు, కే నవీన్ నాయక్, హెచ్ వంశీ నాయక్, చందు, బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మాలోతు చంద్రకళ, బి పద్మ, చందా లక్ష్మీ నరసయ్య, ఫిరోజ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !