మన్యం న్యూస్ చండ్రుగొండ,మే18: ఆటో డ్రైవర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి అన్నారు. గురువారం పోలీస్ స్టేషన్ ఆవరణలో మండలంలోని వివిధ ఆటో అడ్డాల్లో ఉన్న ఆటోలన్నింటి కాగితాల (డాక్యుమెంట్ల)ను ఆమె పరిశీలించారు. ఆటోలకు అడ్డాల వారిగి నంబర్లు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆమె డ్రైవర్లు, ఓనర్లకు అవగాహన కల్పించారు. ఆటో డ్రైవర్లు ప్యాసింజర్లుతో మంచిగా ప్రవర్తించాలన్నారు. గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవాలన్నారు.ఆటోలకు అన్ని రకాలు డాక్యుమెంట్లు ఉండేలా చూసుకోవాలని, ప్రమాదం జరిగినప్పుడు భీమా రావాలంటే కచ్చితంగా అన్ని రకాల డాక్యుమెంట్లు ఉండాలన్నారు. నేరాల అదుపు చేయాలంటే డ్రైవర్లు కచ్చితంగా డ్రస్ కోడ్ పాటించాలన్నారు. ఒకే నెంబర్ పై రెండు, మూడు వాహనాలు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో ఆటోడ్రైవర్లు,యూనియన్ నాయకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.