UPDATES  

 మణుగూరు ఏరియాలో పర్యటించిన అడ్వైజరీ మైనింగ్ డి ఎన్ ప్రసా

ద్

మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 19

మణుగూరు సింగరేణి ఏరియా లో సింగరేణి కాలరీస్ మైనింగ్ అడ్వైజరీ కార్పొరేట్ డి ఎన్ ప్రసాద్ శుక్రవారం పర్యటించారు.ఈ సంధర్బంగా ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ తో కలిసి మణుగూరు ఏరియా లోని కే‌పి‌యూ‌జి,పి‌కే‌ఓసి,ఎం‌ఎన్‌జి‌ఓసి‌ గనులను సందర్శించి బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు.అనంతరం ఆయా గనుల అధికారులతో మాట్లాడుతూ,బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.అలాగే బొగ్గు వార్షిక లక్ష్యాలను సాధించుటకు శ్రమ శక్తిని,యాంత్రిక శక్తిని పూర్తి స్థాయిలో వినియోగించాలని అని తెలిపారు.అలాగే ప్రస్తుతం జీ-7 బొగ్గుకు అధిక డిమాండ్ ఉన్న దృష్ట్యా,ఈ ఆర్థిక సంవత్సరంలో మణుగూరు ఏరియా నుండి ఎక్కువగా జి-7 గ్రేడ్ బొగ్గు ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సంబందిత గనుల అధికారులకు సూచించారు. అనంతరం కే‌సి‌హెచ్‌పి ఏరియను సందర్శించి బొగ్గు ఉత్పత్తి లోనే కాకుండా రవాణాలో కూడా మణుగూరు ఏరియా కొత్త రికార్డు సృష్టించేందుకు కృషి చేయాలని అన్నారు.రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని బొగ్గు ఉత్పత్తిలో, రవాణాలో,ఓబి్ వెలికితీతలో నీటి ప్రవాహం వల్ల ఎలాంటి ఆటంకాలు కలుగకుండా ముందస్తు చర్యలుగా చేబట్టాలని సూచించారు. అనంతరం ఏరియా జిఎం దుర్గం రామచందర్ ఛాంబర్లో అడ్వైజరీ మైనింగ్ డి. ఎన్ ప్రసాద్ ఆత్మీయ సత్కారం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్‌ఓ టు జి‌ఎం డి.లలిత్ కుమార్, ఏజిఎం సివిల్ డి వెంకటేశ్వర్లు,పి‌ఓ కే‌పి‌యూ‌జి జి.నాగేశ్వర రావు, ప్రాజెక్ట్ ఆఫీసర్ పి‌కే‌ఓసి-2 టి లక్ష్మీపతి గౌడ్,ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం‌ఎన్‌జి‌ఓసి బి.శ్రీనివాస చారి, ఏరియా ఇంజినీర్ నర్సీ రెడ్డి, ఏరియా రక్షణ అధికారి వెంకట రమణ,డి‌జి‌ఎం ఐ‌ఈడి కే. వెంకట్ రావు,డి‌జి‌ఎం పర్సనల్ ఎస్ రమేశ్,పి‌కే‌ఓసిు ప్రాజెక్టు మేనేజర్ రాంబాబు,పి‌కే‌ఓసి-2 ప్రాజెక్టు ఇంజినీర్ వీరభద్రుడు, ఎం‌ఎన్‌జి‌ఓసి ప్రాజెక్టు ఇంజినీర్ రవీందర్,కొండాపురం మేనేజర్ వెంకటేశ్వర్లు,ఎం‌ఎన్‌జి‌ఓసి మేనేజర్ రాజేశ్వర రావు, డి‌జి‌ఎం కే‌సి‌హెచ్‌పి సురేశ్, పి‌కే‌ఓసి మేనేజర్ సురేశ్,ఇతర అధికారులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !