మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.
తెలంగాణ ఛత్తీస్గడ్ రాష్ట్ర సరిహద్దుల్లో అక్రమ కలప రవాణాన్ని అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులు. చతిస్గడ్ రాష్ట్రం నుంచి టేకుకలప రవాణా చేస్తున్నారని విశ్వసనీయమైన సమాచారంతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాజమౌళి వారి బృందంతో కలిసి, చెరుకూరు సెక్షన్ ఆఫీసర్ నారాయణ సమాచారం మేరకు సినిమా ఫకీలు చేజింగ్ చేసినట్టుగా లారీ వెంట అర కిలోమీటర్ వెంటాడి దుo గలతో వెళుతున్న లారీని లొట్టపేట గండి సమీపంలో అదుపులో తీసుకున్నారని రేంజర్ రాజమౌళి తెలిపారు. వివరాల్లోకి వెళితే ఇటీవల కాలంలో గిరిజనుల అభివృద్ధి కోసం తెచ్చిన ఇసుకపాలసీ ని దుర్వినియోగం చేస్తూ . సదరు కాంట్రాక్టర్లు ఇసుక రవాణాన్ని అవకాశంగా చె సుకొని ఇసుక బదులుగా విలువైన టేకు కలపను లారీలో వేసుకొని దానిపైన ఇసుక కప్పి హైదరాబాద్, వరంగల్ హనుమకొండ, పరిసర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, సదరు వాజేడు రేంజర్ ఆఫీసర్‌కు తెలిసి గత కొన్ని రోజులుగా ఈ దందాపై నిగా పెట్టినట్టుగా వారు తెలిపారు. పుష్ప సినిమాని మించినట్టుగా ఈరోజు అక్రమ కల్పను తరలిస్తున్న ఇసుక లారీని పట్టుకొని దానిలోని ఇసుకని తవ్వి చూడగా 20 లక్షల విలువైన దుంగలు, చెక్కలు, ఉన్నట్టుగా తేల్చారు. అంతేకాకుండా ఫారెస్ట్ అధికారులు లారీని అడ్డగించే సమయంలో లారీ డ్రైవర్ వారిని చూసి పరారైనట్టుగా . వారు తెలిపారు, అనంతరం దుంగల తో ఉన్న లారీని వెంకటాపురం రేంజ్ ఆఫీసుకు తరలించినట్టుగా ఎఫ్ ఆర్ వో రాజమౌళి తెలియజేశారు.