మన్యం న్యూస్ దుమ్ముగూడెం మే 19::
మండల పరిధిలోని సున్నంబట్టి గ్రామానికి చెందిన చల్ల కళ్యాణ్ (21) అనే యువకుడు గోదావరిలో శుక్రవారం అనుమానాస్పదంగా శవమై కనిపించాడు వివరాలు లోకి వెళ్తే గ్రామానికి చెందిన చల్ల శ్రీనివాసరావు ప్రమీల దంపతులకు ముగ్గురు కుమారులు కాగా ఇరువురు కుమారులకు వివాహం జరిగింది మూడవ కుమారుడు చల్ల కళ్యాణ్ భద్రాచలంలో డిగ్రీ విద్యను అభ్యసిస్తున్నాడు చదువుతోపాటు యువకులతో కలిసి ఆటపాటలతో ముందుండే కళ్యాణ్ తల్లిదండ్రులకు వ్యవసాయ పనులకు సాయం అందిస్తూ ఉంటాడు ఎటువంటి చెడు అలవాటు లేని కళ్యాణ్ ఈనెల 17వ తేదీన సాయంత్రం సమయంలో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆట కోసం బైరాగులుపాడు గ్రామానికి వెళ్లి అనంతరం ఇంటికి వచ్చి అన్నయ్య ప్రవీణ్ తో కలిసి ఆరుబయట పడుకున్నాడు. ఉదయం లేచి చూడగా మొబైల్ ఫోను ఇంట్లో పెట్టి గురువారం ఉదయం నుంచి కనపడలేదు స్నేహితుతో కలిసి ఆటలకి ఏమైనా వెళ్లి వస్తాడని ఎదురుచూసిన తల్లిదండ్రులు ఎంతకీ రాకపోవడంతో స్నేహితులు కుటుంబ సభ్యులు అందరూ ఆరా తీశారు. అనంతరం శుక్రవారం ఉదయం చేపల వేటకు వెళ్లే జాలర్లు నదిలో శవమై తేలిన కళ్యాణ్ చూసి పోలీసు వారికి సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు కళ్యాణ్ మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరు అయ్యారు. అన్నయ్య తెలిపిన వివరాల ప్రకారం పడుకునే ముందు ఒంటిగంట వరకు ఫోను మాట్లాడుతున్నాడని తర్వాత ఉదయం లేచి చూసేసరికి కనిపించలేదని అన్నాడు. తమ కుమారుడు మృతికి పూర్తిస్థాయిలో విచారణ చేసి న్యాయం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు మృతుడు తండ్రి శ్రీనివాస రావు ఫిర్యాదు మేరకు ఎస్సై కేశవ్ శవానికి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి చేస్తున్నారు.