UPDATES  

 నకిలీ విత్తనాలు విక్రయిస్తే డీలర్ షాపులు సీజ్.

 

మన్యం న్యూస్ వాజేడు

ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు రైతు వేదికలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ సంయుక్తంగా నకిలీ విత్తనాల నివారణ కొరకు విత్తన డీలర్స్ కి అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సహయ వ్యవసాయ సంచాలకులు ఎటూర్ నాగారం శ్రీధర్ హాజరై ఆయన మాట్లాడుతూ గుడ్డ సంచుల్లో అమ్మే విత్తనాలను, లూజ్ సీడ్ అమ్మకాలు జరిపేవారిని ప్రొపెర్ రెబలింగ్ లేని విత్తనాలను నకిలీ విత్తనాలుగా గుర్తించి వాటిని అమ్మకుండా ఉండాలని ఎవరైనా అమ్మితే వ్యవసాయ శాఖకు తెలియ జేయలాని కోరారు. అనుమతి లేకుండా సరైన రిజిస్టర్ బిల్లులు లేకుండా విత్తనాలు అమ్మేవారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేరూరు ఎస్సైహరీష్ మాట్లాడుతూ నిబంధనలు పాటించని డీలర్స్ పై చర్యలు తీసుకుంటామని హెచచరించారు .ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి గుంటక నరసింహ రావు,వ్యవసాయ విస్తరణ అధికారులు హరీష్,రాధిక జాఫర్, ఫర్టి లైజర్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్బాస్ హుస్సేన్ , సోమరాజు, సంతోష్. రాంబాబు పాల్గోన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !