మన్యం న్యూస్ దుమ్ముగూడెం మే 19::
మండల పరిధిలోని పెద్ద కమలాపురం, దుమ్ముగూడెం గ్రామంలో ఇటీవల అగ్నిప్రమాదం సంబంధించి మూడు ఇల్లు అగ్నికి ఆహుతయ్యాయి. సర్వం కోల్పోయిన ఆ కుటుంబాలను భద్రాచలం శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోదెం వీరయ్య శుక్రవారం పరామర్శించి బాధిత కుటుంబాలకు నిత్యవసర సరుకులు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పక్కా గృహాలు మంజూరు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లంక శ్రీనివాసరావు సీనియర్ నాయకులు సీతారామారావు అప్పల్ రెడ్డి ఉబ్బ వేణు తెల్లం నరేష్ జిల్లా సోషల్ మీడియా చైర్మెన్ కనుబుద్ది దేవా సర్పంచ్ చలపతి పిలక వెంకటరామిరెడ్డి డివిజన్ యూత్ సెక్రెటరీ లంక శివ చంటి రవి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.