మన్యం న్యూస్ కరకగూడెం: క్రీడలు మానసిక ఉల్లాసనికి,శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య అన్నారు.శుక్రవారం అనంతారం పంచాయతీ పరిధిలోని ముత్తారం గ్రామంలో విలేజ్ ప్రీమియం లీగ్ సీజన్-2 క్రికెట్ టోర్నమెంట్ ను అయన ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రీడాల పట్ల యువత ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు.త్వరలో పినపాక నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను రేగా యువసేన ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.ఈ క్రీడల్లో 36 జట్లు పాల్గొన్నాయని నిర్వహణ కమిటీ తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రేగా సత్యనారాయణ,అనంతరం ఉప సర్పంచు అత్తె సత్యనారాయణ,యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్,నిర్వహణ కమిటీ సభ్యులు వెంగళి గోపి,వడ్లకొండ వెంకట్,కల్తి నరేష్,గుడ్ల వినోద్,సిరిశెట్టి రంజిత్,క్రీడాకారులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.