– నకిలీ విత్తనాలు పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి*
– నకిలీ విత్తనాలు విక్రయించవద్దు సీఐ రవీందర్ ఎస్సై కిన్నెర రాజశేఖర్
మన్యం న్యూస్ గుండాల..నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని గుండాల సీఐ ఎల్ రవీందర్, ఎస్సై కిన్నెర రాజశేఖర్ రైతులకు సూచించారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో మండల కేంద్రంలోని విత్తనాలు విక్రయించే వ్యాపారస్తులతో సమావేశాన్ని వారు నిర్వహించారు. రైతులకు నకిలీ విత్తనాలను విక్రయించవద్దని వారు సూచించారు నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారులపై క్రిమిన కేసులు, పిడి యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పనిచేస్తామని అన్నారు. రైతులు ఎక్కడనుండా వచ్చి విక్రయించే వారి వద్ద నుండి విత్తనాలను పురుగుమందులను కొనొద్దని వారు సూచించారు. మండలంలో ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినట్టు సమాచారం ఉంటే 100 నెంబర్ కు లేదా స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని కోరారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై చట్టపరమైన కట్టిన చర్యలు తీసుకో పడతాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు మానాల వెంకటేశ్వర్లు, మానాల ప్రభాకర్, తిరుకొల్లూరి వెంకన్న, మాడే మంగయ్య, తిరుకొల్లూరి శేషు, తదితరులు పాల్గొన్నారు .