మన్యం న్యూస్ దుమ్ముగూడెం మే 19::
రెండో విడత గొర్రెల పంపిణీ మండలంలో 70 యూనిట్లు మంజూరైనవని లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మండల స్పెషల్ ఆఫీసర్ సులోచన రాణి తెలిపారు మండలంలోని లక్ష్మీనగరం గ్రామపంచాయతీ పరిధిలోని కన్నాపురం గ్రామంలో 12 మంది లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం ఈనుటి విలువ 1.5 లక్షలు కాగా లబ్ధిదారుడు చెల్లించు మొత్తం రూ.40 వేలు చెల్లించినట్లయితే లబ్ధిదారులకు 20 గొర్రెలు ఒక గొర్రెపోతును పంపిణీ చేస్తామని తెలియజేశారు. లబ్ధిదారులు త్వరగా డీడీలను చెల్లించి ధ్రువీకరణ పత్రాలు మండల వైద్యాధికారి అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం ఎంపీడీవో జి ముత్యాలరావు వెటర్నరీ డాక్టర్ ఫాతిమా తదితర సిబ్బంది పాల్గొన్నారు