UPDATES  

 కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత… పుచ్చలపల్లి సుందరయ్య ఘనంగా 38వ వర్ధంతి వేడుకలు

మన్యం న్యూస్ చర్ల :
చర్ల మండల కేంద్రంలో కామ్రేడ్ బిఎస్ రామయ్య భవనంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బందెల చంటి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముందుగా అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పార్టీ మండల కమిటీ సభ్యులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కమిటీ సభ్యులు మచ్చా రామారావు మాట్లాడుతూ మన దేశ చరిత్రలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత సుందరయ్య అన్నారు. సుందరయ్య పేద ప్రజల కోసం అహర్నిశలు కష్టపడ్డారని నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం ఆయన అని అన్నారు. బడుగు బలహీన వర్గాల వారిని అక్కున చేర్చుకొని వారికి ఈ సమాజం పట్ల అవగాహన కల్పిస్తూ చైతన్యాన్ని తగిలిస్తూ వర్గపోరు బాటలో ఎర్రజెండా నీడలో ఆయన పయనించారు. అంతటి గొప్ప మహానీయుని వర్ధంతి మహాసభ జరుపుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉందని, ఆయన బాటలో మేము పయనిస్తామని ఆయన ఆశయాలను మేము నెరవేరుస్తామని, ప్రతిజ్ఞ పూనారు ఎర్రజెండా అంటే సుందరయ్య అని ఆయన తనకు ఉన్నటువంటి భూములను పేదవారికి పంచారని పేద వాళ్లకు ఆయన ఒక నిలువెత్తు రూపం అని ఆయన కొనియాడారు. కనుక నేటి బాలలే రేపటి పౌరులు అనే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి యువతి యువకులు అర్థం చేసుకొని సుందరయ్య గారి బాటలో నడవాలని ఆయన అన్నారు. ఈ సభలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యురాలు పొడుపుగంటి సమ్మక్క మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం మహిళల హక్కుల కోసం సుందరయ్య గారు పాటుపడ్డారని ఆయన ఆశయాలనుమేము నెరవేరుస్తామని అన్నారు. ఈ సభలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షురాలు ఊడుగుల షారోని, సిఐటి మండల నాయకులు పామూరు బాలాజీ, గిరిజన సంఘం మండల నాయకురాలు వరదల వరలక్ష్మి, తదితరులు ఈ వర్ధంతి సభలో పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !