మన్యం న్యూస్ దుమ్ముగూడెం మే 19::
ఉద్యమ నాయకులు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఎలమంచి సీతారామయ్య వారి వారసత్వాన్ని కొనసాగించి ఆశయ సాధనకై ఉద్యమించాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎంపీ మీడియం బాబురావు అన్నారు. మండలంలోని లక్ష్మీనగరం సీతారామయ్య స్థూపం వద్ద ఇరువురి నాయకుల వర్ధంతి వేడుకలను నిర్వహించి వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ నాయకుల్ని స్ఫూర్తి తీసుకొని దుమ్ముగూడెం మండలంలో సిపిఎం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు తిరువూరు నాయకులు కూడా భూస్వామి కుటుంబాల్లో పుట్టి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం కృషి చేశారని దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత తెలంగాణ రైతంగ సాయుధ పోరాట నేత సిపిఎం పార్టీ వ్యవస్థాపక కార్యదర్శి సుందరయ్య అని గుర్తు చేశారు దుమ్ముగూడెం మండలంలో సీతారామయ్య నియోజకవర్గ అభివృద్ధి కోసం ముందుండి భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన మహానేతని అన్నారు కానీ ఈనాడు దేశంలో బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ ప్రైవేటు వ్యక్తులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎలమంచి రవికుమార్ సిపిఎం భద్రాచలం నియోజకవర్గం కోకన్వీనర్ కారం పుల్లయ్య జిల్లా కమిటీ సభ్యులు చంద్రయ్య పద్మ చిలకమ్మ సూర్యచంద్రరావు శ్రీనుబాబు ఖాదర్ బాబు లోకేష్ బాబు గుడ్ల సాయి రెడ్డి రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు