మన్యం న్యూస్ దుమ్ముగూడెం మే 19::
దుమ్ముగూడెం గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురైన మురికిపూడి వీర్రాజు నాగమ్మ దంపతులకు ఎలమంచి సీతారామయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అండగా ఉంటామని చేయూతని అందించారు. మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మీడియం బాబురావు చేతులు మీదుగా పదివేల రూపాయల సామాగ్రి రూ.3 వేల రూపాయల నగదును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాలకు సిపిఎం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు అందరూ కూడా అమరజీవులు సుందరయ్య సీతారామయ్య గారి స్ఫూర్తితో ముందుకు నడవాలని సూచించారు ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజవర్గం పుల్లయ్య సొసైటీ డైరెక్టర్ శ్రీనుబాబు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వంశీకృష్ణ చిలకమ్మ నరసింహారావు బైరెడ్డి సతీష్ తదితరులు పాల్గొన్నారు.