మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 19
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను పినపాక నియోజకవర్గం బిఆర్ఎస్వి అధ్యక్షులు రాహుల్ గౌడ్ శుక్రవారం నాడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాహుల్ గౌడ్ మాట్లాడుతూ,హైదరాబాద్ మహా నగరంలో నీరా కేఫ్ ఏర్పాటు చేసి తెలంగాణ సాంప్రదాయాన్ని,ఖ్యాతిని దేశ నలుమూలలకు విస్తరింప చేసినందుకు మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీరా కేఫ్ కు మంచి స్పందన లభిస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్ ఎన్ రాజు,భద్రాద్రి బిఆర్ఎస్వి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు అనుదీప్,జిల్లా అధ్యక్షులు పవన్ నాయక్,శ్రీరామ్,క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.