UPDATES  

 ప్రతీ మనిషి సుందరయ్య లా ఆలోచించాలి జీవించాలి. సీపీఎం జిల్లా కార్యదర్శి.. అన్నవరపు కనకయ్య

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

సీపీఎం అధ్వర్యంలో శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పలుచోట్ల పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సభ లు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య సుందరయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభల్లో కనకయ్య మాట్లాడుతూ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య (పీఎస్)బాల్యం నుండి స్వాతంత్ర్య స్ఫూర్తితో, అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ప్రజలు పడుతున్న సమస్యలు కళ్ళారా చూసి ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయని ఆ రోజులు కమ్యునిస్ట్ ఉద్యమాలు వలనే వస్తాయని మార్క్సిజం పట్ల ఆకర్షితుడై న సుందరయ్య కార్మిక , కర్షక పోరాటాల్లో కీలక పాత్ర పోషించారనీ అన్నారు. ఉద్యమాలు నేపథ్యంలో పోరాటాలు కి ప్రాధాన్యత తగ్గుతుందనే గొప్ప ఆలోచనతో పిల్లలు లేకుండా లీల గారితో సహచర జీవితాన్ని ప్రజా సేవకు అంకితమైన విప్లవ కెరటం సుందరయ్య అని కొనియాడారు. అనేక సార్లు ఎమ్మెల్యే గా గెలిచి సామాన్య జీవితాన్ని గడుపుతూ నాటి నేటి ప్రజా ప్రతినిధులకి ఆదర్శ మూర్తి గా నిలిచారని అన్నారు. కమ్యునిస్ట్ ఉద్యమాల నేపథ్యంలో అనేక ఆటంకాలు ఎదురైనా వాటిని ఎదుర్కుంటూ , మార్క్సిజం పునాదులపై నూతన సమాజాన్ని సృష్టించాలని కృత నిశ్చయంతో ముందుకు సాగాలని సూచించిన సైద్ధాంతిక నేత సుందరయ్య అని అన్నారు. సుందరయ్య జీవితం తరతరాలకు ఆదర్శం అన్నీ అన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్, భూక్యా బాబు, ఎమ్మెస్ ప్రకాష్, బిక్కులాల్, కేహెచ్ ప్రసాద్, రమేష్ బాబు, జయలక్ష్మి, హెమ్ల, నారాయణ, రామ, శక్రాం, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !