*మన్యం న్యూస్ గుండాల..ముఖ్యమంత్రి కేసీఆర్ మా దేవుడంటూ వీఆర్ఏలు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి శుక్రవారం తాసిల్దార్ కార్యాలయం ముందు పాలాభిషేకం చేశారు. అనంతరం వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు వట్టం సారయ్య,ప్రధాన కార్యదర్శి గుర్రం శివాజీ లు మాట్లాడుతూ నిన్న జరిగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో వీఆర్ఏలను పర్మినెంట్ చేస్తున్నట్టు క్యాబినెట్ తీర్మానం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం మా కోరికను తీర్చినందుకు ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని వారు పేర్కొన్నారు. మా శ్రమను గుర్తించి మా కోరిక నెరవేర్చిన మంత్రి కేటీఆర్, మంత్రి హరీష్ రావుకు, మా వినతి పత్రాలను పలుమార్లు స్వీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన పినపాక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు ప్రత్యేక ధన్యవాదాలు వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు జనగం సారయ్య, స్వరూప, శేఖర్, నర్సమ్మలు పాల్గొన్నారు.