మన్యం న్యూస్ చండ్రుగొండ మే 19: మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన దక్షిణ భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతిని పురస్కరించుకొని పార్టీ కార్యాలయంలో శుక్రవారం సిపిఎం మండల కమిటీ ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పార్టీ మండల కమిటీ సభ్యులు రాయి రాజా మాట్లాడుతూ… దేశంలో ఆచరణ, అంకిత భావం కమ్యూనిస్టుగా జీవించడం, ఉత్తమమైన రాజకీయ నాయకుడిగా కొనసాగడం అందరికీ సాధ్యం కాదని, అది కొందరికి సాధ్యమని అందులో కమ్యూనిస్టులకే సాధ్యమని మనందరికీ సుందరయ్య ఆదర్శమని,ఈ తరం నాయకులు సుందరయ్య ఆదర్శాలను తీసుకోవాలని, అలగానిపాడు నెల్లూరు జిల్లా ఓ ధనిక కుటుంబంలో జన్మించి పేదల బాధల సాధకాలను గ్రహించి వాటన్నిటికీ పరిష్కారం చిన్నతనంలోనే కమ్యూనిస్టు భావాజాలమును వంట పట్టించుకోని కమ్యూనిస్టు అంటే ఏంటో అనేది నిరూపించిన మహా నేత అని, అనేకమంది తల్లి గర్భంలో శిశువులు మరణిస్తా ఉంటే ప్రత్యేకించి కాన్పులు చేసిన మంచి మనసున్న నేతగా స్వతంత్ర సమరయోధుడిగా దళిత గిరిజనుల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తిగా వ్యవసాయ కార్మిక సంఘాన్ని గ్రామస్థాయి నుంచి దేశస్థాయిలోకి, నిర్మించిన వ్యక్తిగా, అదేవిధంగా చట్టసభల్లో కి సైకిల్ మీద వెళ్లి అమూల్యమైన ప్రసంగాలు ఇచ్చిన, పాలక పక్షానికి కూడా సూచనలు సలహాలు ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఓల్డ్ టైమర్ పార్టీ మండల కమిటీ సభ్యులు పెద్దినీ వేణు, విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, రామడుగు వెంకటాచారి చంద్రుగొండ హమాలి ముఠా సభ్యులు, దాసరి బాబు, బేతి రాంబాబు తదితరులు పాల్గొన్నారు…