మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 19: రెండు మండలాల అగ్రి డీలర్లలకు సిఐ బాలకృష్ణ స్థానిక పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక సమావేశం శుక్రవారం ఏర్పాటు చేశారు. లైసెన్స్ లేకుండా విత్తనాలు అమ్మినా, సరఫరా చేసినా నకిలీ విత్తనాలు విక్రయిస్తే షాపు యజమానుల పై పిడియాక్టు నమోదు చేసి జరిమానా రూ.10 లక్షల వరకు విధిస్తామని సిఐ బాలకృష్ణ హెచ్చరించారు. అశ్వారావుపేట మండలం, దమ్మపేట మండలంలో విత్తనాలు ఎరువులు తప్పని సరిగా లైసెన్స్ తీసుకొని వ్యవసాయ శాఖ అనుమతి వున్న విత్తనాలనే అమ్మాలని సూచించారు. షాప్ లేకుండా బయటి రాష్ట్రాలు నుండి విత్తనాలు తెచ్చి ఇంట్లో పెట్టి అమ్ముతున్నట్లు తెలిస్తే అశ్వారావుపేట పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని సిఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజేష్ కుమార్ పాల్గొన్నారు