మన్యం న్యూస్ చండ్రుగొండ,మే 19: విఆర్ఎలను రెగ్యులర్ చేస్తామని రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయించటం అభినందనీయమని, విఆర్ఎల కుటుంబాలు జీవితాంతం ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాయని విఆర్ఎల సంఘం జిల్లా అద్యక్షులు షేక్ చాంద్ మీరా అన్నారు. శుక్రవారం విఆర్ఎల సంఘం తరుపున మండల కార్యలయ ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇచ్చిన మాట ప్రకారం విఆర్ఎలను రెగ్యులరైజేషన్ చేస్తున్నందుకు రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్ఎల సంఘం మండల నాయకులు నవీన్, సైదా, లక్ష్మిపతి, జయరాజు, రాజు, ఉస్మాన్, జానిమియా, ముత్తయ్య, మౌలానా, రోజా, తదితరులు పాల్గొన్నారు.