నకిలీ విత్తనాలు అమ్మితే ఉపేక్షించం
పిడియాక్టు కేసులు నమోదు చేస్తాం…
కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రహమాన్..
మన్యం న్యూస్ చండ్రుగొండ, మే 19: రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే పిడియాక్టు కేసులు నమోదు చేస్తామని కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రహమాన్ డీలర్లును హెచ్చరించారు. శుక్రవారం స్థానిక పోలీస్టేషన్ ఆవరణలో జరిగిన విత్తనాల డీలర్ల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ ఆనుమతులు ఉన్న విత్తన కంపెనీలకు సంబంధించిన విత్తనాలు మాత్రమే రైతులకు విక్రయించాలన్నారు. గుర్తింపులేని విత్తన కంపెనీల విత్తనాలు రైతులకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం నకిలీ విత్తనాల విషయంలో సీరియస్ ఉందని, ఏ మాత్రం రైతులకు నష్టం జరిగినా సహించేది లేదన్నారు. ఎరువులు, పురుగు మందుల విక్రయ డీలర్లు కచ్చితంగా పాదర్శకంగాఅమ్మాలన్నారు. ఎన్ని విత్తన ప్యాకెట్లు తెచ్చారు. ఎన్ని విక్రయించారు. ఎవరికి విక్రయించారు. బ్యాలెన్సు ఎన్ని ఉన్నాయనే విషయాలు బోర్డుపై ప్రదర్శించాలన్నారు. ఈ సమావేశంలో జూలూరుపాడు సిఐ వసంత కుమార్, ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి, పురుగుమందు డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.