మన్యం న్యూస్, పినపాక:
పినపాక మండలం సీతంపేట గ్రామానికి చెందిన గుండారపు రాజు రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలికి ఆపరేషన్ అయ్యి మంచానికే పరిమితం కావడంతో ఇల్లు గడవడం కష్టంగా మారి వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకొని మణుగూరు పట్టణానికి చెందిన “జనం కోసం మనంం” స్వచ్చంద సంస్థ రూ.10వేల రూపాయలు నగదు అందించారు. సంస్థ సభ్యుడు వేమిరెడ్డి సాంబశివారెడ్డి,నందిని దంపతుల కుమార్తె నక్షిత్ర పుట్టినరోజు సందర్బంగా 50కేజీల బియ్యం సహాయంగా అందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు వేముల భాస్కర్, బండారు సురేష్, అజార్, కొండేరు రోహిత్, సంస్థ సభ్యులు పాల్గొన్నారు